Dr APJ Abdul Kalam -THE MISSILE MAN OF INDIA

“రాష్ట్రపతి” అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు అబ్ధుల్ కలాం గారు. ఒక్క రాష్ట్రపతి అంటేనే కాదు “Inspirational” అనే పదం విన్నా, “భారతరత్న” అనే పదం విన్నా మనకు వెంటనే ఆయనే గుర్తోస్తారు. మహాత్మ గాంధీ గారిని విమర్శించే వాళ్ళున్నా కూడా అబ్ధుల్ కలాం గారిని విమర్శించేవారు లేరు. మనకు ఆయన అందించిన స్పూర్తి వాక్యాలు తెలుసు, కలాం గారి గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం.



1. కలాం గారు బ్రహ్మచారి. ఒకసారి ఒక మీటింగ్ కు వెళ్ళినప్పుడు కలాం గారిని చిన్నపిల్లలు ఇలా ప్రశ్నించారు.. మీరు పెళ్ళేందుకు చేసుకోలేదు..? దానికి కలాం గారు “నేను పెళ్ళిచేసుకుంటే నా కుటుంబం, నా పిల్లలు అంటూ నాలో స్వార్ధం పెరిగి నా ప్రేమ వారికే అందేది అందుకే చేసుకోలేదు. ఇప్పుడు చూడండి నాకు ఈ ప్రపంచమే నా కుటుంబం అయ్యింది, మీరే కన్న బిడ్డలయ్యారు” అని ఆప్యాయంగా చెప్పారట.




2. ఆయన లాంగ్ హేయిర్ కి పెద్ద కథ అంటూ ఏమి లేదు. రెండు చెవులలో ఒక చెవి మరి చిన్నగా ఉండటంతో అది కనిపించకుండా ఉండాలని మొదట జుట్టు పెంచారు, కాని తర్వాతి కాలంలో ఆ Hair Style వల్ల కలాం గారి Look కి ఒక Unique Identity రావడంతో దానిని అలాగే కంటిన్యూ చేశారట.




3. మనందరికి తెలిసిందే కలాం గారు చిన్నతనంలో పేపర్ వేసేవారు. కాని ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే “ఇంటింటికి తిరిగి పేపర్ వేసే ముందు ఆ పేపర్ మొత్తం చదివేవారు” Knowledge ని పెంచుకునే ప్రక్రియలో ఆయన అంకిత భావం ఆ స్థాయిలో ఉండేది.


4. కలాం గారు ప్రతి ప్రాణిని ప్రేమించేవారు. రక్షణ కొరకు ఇంటి కంపౌడ్ గోడమీద పగులగొట్టిన గాజు సీసాలను ఉంచుదాం అని ఒక వ్యక్తి సలహా ఇస్తే “దీని మూలంగా పక్షులకు ప్రమాదం కలుగుతుంది” అని సున్నితంగా తిరస్కరించారట.



6. అబ్ధుల్ కాలం గారు వెజిటేరియన్. Smoking, Alcohol కూడా తీసుకోరు. ఆయన చెడు అలవాట్లకు చాలా దూరం.

akshaya_patra_apj_abdhul_kalam_school_children


7. సమయానికి అధిక విలువిచ్చారు. ఒకసారి ఒక స్కూల్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. ఏ విధమైన ఆటంకం జరిగినా Meetingను నిర్విఘ్నంగా పూర్తిచేయాలని విద్యార్ధుల దగ్గరికి వెళ్ళి “మీరందరూ నా చూట్టు ఉండండి అంటూ తాను వారి మధ్యలో నిలబడి 400 మంది విద్యార్ధులకు వినపడేలా ప్రతి ఒక్కరిని చూస్తూ లక్ష్యం గురించి గొప్ప Speech ఇచ్చారట”.


8. ఆయన ఆస్తి వివరాలు: 3 పాంట్లు 6 షర్టులు, 3 సూట్లు, 1 వాచ్, 2500 పుస్తకాలు, Scientists Community Bangalore వారు ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు, ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్, 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.




9. భారతదేశంలో స్వామి వివేకనంద తర్వాత అంతటి స్థాయిలో కలాం గారి Motivational Quotes ప్రాముఖ్యం చెందినవి.


10. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు విద్యార్ధులు ఎంతో మంది కలాం గారికి ఉత్తరాలు రాసేవారు అలా రాసిన ప్రతి ఒక్కరికి ఓపికతో కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి లెటర్స్ రాసి పంపేవారు.

Comments

Popular Posts